calender_icon.png 27 October, 2024 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ బ్యూటీఫుల్ లేడీ.. ‘సర్దార్’కు మరో జోడీ

06-08-2024 12:05:00 AM

హీరో కార్తి ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటీవలే ‘సర్దార్2’ రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభమైంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్ ఫిమేల్ లీడ్ చేస్తుండగా ఎస్‌జే సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ మరో ఫిమేల్ లీడ్‌గా కనిపించనున్నారని తెలిపారు. ఆషికాకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆమెను మేకర్స్ ప్రాజెక్టులోకి స్వాగతం పలికారు.