22-03-2025 12:00:00 AM
సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో ‘సిటాడెల్: హనీబన్నీ’ అనే వెబ్ సిరీస్ రూపొందిన విషయం తెలిసిందే. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సిరీస్‌లో వీరిద్దరి నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఈ సిరీస్‌లో సమంత ఉత్తమ నటన కనబర్చారంటూ ఓ మీడియా సంస్థ ఆమెకు ఓటీటీ ఉత్తమ నటి పురస్కారానని అందించింది. ఈ అవార్డు తనకు దక్కటంపై సమంత తాజాగా స్పందిస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సిరీస్ జర్నీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను సమంత ఈ సందర్భంగా పంచుకున్నారు. “నాకు ఇష్టమైన నటీనటులెందరో ఈ అవార్డు నామినీ బరిలో ఉన్నారు. కానీ ఈ పురస్కారం నన్ను వరించడం.. నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. వాస్తవానికి ఈ సిరీస్‌ను పూర్తి చేయడం ఓ సవాల్‌గా మారింది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య దీన్ని విజయవంతంగా పూర్తి చేయడమే నాకొక అవార్డుతో సమానం.
నన్ను నమ్మినవారికి ఈ అవార్డు అంకితం ఇస్తున్నా. ఈ సిరీస్ అంత సులభంగా పూర్తయ్యేది కాదని నాకు తెలుసు. కానీ రాజ్‌అండ్‌డీకే, వరుణ్ ధావన్‌ల కారణంగానే నేను ఈ సిరీస్ పూర్తి చేయగలిగా. ఈ క్రమంలో వాళ్లు ఎంతో ఓపికగా వ్యవహరిస్తూ, నన్నూ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ విషయంలో వారికి థాంక్యూ.