calender_icon.png 12 January, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ సభ కౌరవుల సభను తలపిస్తుంది: హరీశ్ రావు

01-08-2024 02:13:55 PM

హైదరాబాద్‌: సభను కౌరవులసభలాగా నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ఈ సభ కౌరవుల సభను తలిపిస్తోందన్నారు. అంతిమంగా గెలిచేది పాండవులు.. నిలిచేది ధర్మమేనని ఆయన పేర్కొన్నారు. అధికార పక్షం అహంకారంతో చేస్తున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని సూచించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందన్నారు. 29 నవంబర్ 2014లో తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తీర్మాణం గురించి కేసీఆరే స్వయంగా ప్రధానికి వివరించారని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీకి కూడా బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని హరీశ్ రావు పేర్కొన్నారు.