06-04-2025 11:20:38 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): భద్రాచలంలో వైభవోపేతంగా తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. అభిజిత్ లగ్నంలో సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుక జరుగనుంది. సీతారాముల కల్యాణం కోసం మిథిలా మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. భద్రాద్రి కోడంరాముడిని తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు.