19-04-2025 01:19:08 AM
-ప్రాధాన్యతను బట్టి పనులు చేస్తున్నాం
-మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్
మహబూబ్ నగర్ ఏప్రిల్ 18 (విజయ క్రాంతి) : గత 30 సంవత్సరాల నుంచి తిమ్మసాని పల్లె ప్రాంత వాసులకు సిసి రోడ్డు ఒక కలల ఉండేదని ఇప్పుడు ఆ కళ నెరవేరుతుందని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. పట్టణంలోని తిమ్మనసాని పల్లెలో ఏండ్ల తరబడి ఎదురుచూసిన సిసి రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో దురదృష్టితో అవసరమైన పనులలో అత్యవసరంగా ఉన్న పనులను గుర్తించి ముందు వాటిని చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె వెంకటేష్, ex కౌన్సిలర్ తిరుమల వెంకటేష్, పల్లె నరసింహులు, వరద రవి, రాఘవ, శోభ తదితరులు ఉన్నారు.