22-03-2025 12:55:50 AM
అసలు విద్యుత్ శాఖలో ఏం జరుగుతుంది?
33 కెవి విద్యుత్ లైన్ నాసిరకంగా పనులు
మా దృష్టికి తీసుకురావాలంటున్న విద్యుత్ శాఖ ఎస్‌ఈ
ఎక్కడ తప్పులుంటే అక్కడ చూపించండి పనులు చేయిస్తాం.. లేదంటే సీఎండీకి చెప్పండి : టెక్నికల్ డిఈ
పాతిన స్తంభాల దగ్గర గుంతలు తీసి కంకర బెడ్డు వేసిన కాంట్రాక్టర్
మహమ్మదాబాద్ మార్చి 21 : అధికారులకు నిబంధనలు పట్టవా... ఎస్టిమేషన్ ఏముంటుంది... ఆ నిబంధనలతో చేత తప్పకుండా పాటిస్తూ పనులు చేస్తే సరిపోతుంది కదా.. కాగా ఇక్కడ అది జరగడం లేదు... వివిధ కారణాలు చెబుతూ గాబరు గాబరాగా పనులు చేస్తూ ఎలాగా ఒకలా పని పూర్తి చేసి బిల్లులు రాబడితే చాలు అనుకుంటున్నారో ఏమో కానీ గాదిర్యాల సమీపం లోని ప్రధాన సబ్ స్టేషన్ నుంచి నంచర్ల గేట్ మీదుగా మహమ్మదాబాద్, వెంకట్ రెడ్డి పల్లె వరకు 33 కెవి లైన్ నూతనంగా వేయడం జరుగుతుంది. ఈ పనుల్లో నాణ్య త లోపించిందని విజయ్ క్రాంతి దినపత్రిక ఈనెల 19వ తేదీన ’పనైపోతే సరిపోతుందా ? ’ అనే కథనం ప్రచురితం చేసింది. ఈ కథనంపై స్పందించిన జిల్లా విద్యుత్ శాఖ అధికార యంత్రాంగం స్పందించింది.
33 కెవి లైన్ కు సంబంధించి స్తంభాలు ఎక్కడైతే పాతడం జరిగిందో ఆ ప్రాంతంలో స్తంభం వేసే సమయంలో దాదాపు రెండు మీటర్ల పొడవునా కంకర బెడ్డు వేయవలసి ఉంటుంది. కాగా అధికారులు స్పందించి ఆ స్తంభాల దగ్గర గుంతలు తవ్వి శుక్రవారం కంకర బెడ్డును స్తంభాల చుట్టూ వేయడం జరిగింది. దారి పొడుగునా పోతున్న వారు సైతం స్తంభం కోసం గుంత తీసిన సమయంలో స్తంభాన్ని నిటారుగా నిలబెట్టి కంకర బెడ్డు వెయ్యాలి కాగ స్తంభాలకు పైన వైర్ కోపింగ్ చేసిన స్తంభం చుట్టూ గుంత తవ్వి కంకర బెడ్డు వేయడమేంటని చర్చించుకుంటున్నారు. కంకర బిడ్డు వేస్తున్న దృశ్యాలను కూడా విజయక్రాంతి దినపత్రిక రిపోర్టర్ ను పిలిచి చూయించడం జరిగింది.
-శుభ్రంగా సీఎండికి చెప్పుకోండి... డిఈ టెక్నికల్
మహమ్మదాబాద్ మండల పరిధిలోని ప్రధాన రోడ్డు పక్కన వేయించుకున్న 33 కెవి విద్యుత్తు లైన్ పనులలో నాణ్యత లోపించడం జరిగిందని కొన్ని ప్రాంతాల్లో స్టట్ పోల్ విరిగిపోవడం తో పాటు పలు సందర్భాలలో నిబంధనలు పాటించడం లేదని రాసిన కథనానికి విద్యుత్ శాఖ డిఈ టెక్నికల్ స్పందించి ఫోన్ ద్వారా సంభాషించారు. ప్రస్తుతం వర్కు నడుస్తుందని, ఎక్కడ కూడా నాణ్యత లోపించలేదని విజయ క్రాంతి దినపత్రిక కు తెలియజేశారు. ఎక్కడైనా ఇబ్బం దులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, లేదంటే శుభ్రంగా సీఎండి కీ కూడ చెప్పుకోవచ్చని సమాధానం చెప్పారు. తప్పు జరి గింది అని అధికారులకు విషయాన్ని తెలియజేస్తే వివిధ పత్రికల వాళ్ళు ఎంతో మంది వస్తారని రాతల్లో రాయలేని సమాధానం చెప్పారు. బాధ్యత గల అధికారులు ప్రజాధనం వృధా కాకుండా చేయవలసి ఉండి ఇలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసమో సంబంధిత అధికారి ఆలోచన తీరును ఉన్నత అధికారులు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సదరు అధికారిని ఫోన్ ద్వారా పేరు తెలపాలని అడగగా చెప్పేందుకు నిరాకరించారు.
ఎస్టిమేట్ ప్రకారం పనులు చేస్తే ఎవరు వద్దంటారు..?
విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లతో వివిధ పనులు చేయిస్తుంటారు. ప్రతి పనికి ఎస్టిమేట్ వేయడం జరు గుతుంది. అధికారులు ఆ నిబంధనలను సంబంధిత కాంట్రాక్టర్ కూడా తెలియ జేస్తారు. ఆ నిబంధనలు పట్టించుకోకుండా పనులు చేయడం ఏంటని అధికారుల దృష్టి కి తీసుకుపోతే కొందరు అధికారులు సైతం అసహనంగా సమాధానం చెబితే, ఈ పనులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజ లు చర్చించుకుంటున్నారు. ఇకనైనా అధికారు లు బాధ్యతగా వ్యవహరించి నిబంధనల ప్రకారం పనులు జరిగేలా చూడాలని ప్రజ లు కోరుతున్నారు.నిబంధనల పాటి స్తూ పనులు చేయడం ద్వారా ఇటు కాంట్రాక్టర్ కు మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పా టు సంబంధిత అధికారులకు సైతం ప్రజల నుంచి మండల పొందే అవకాశం ఉంది.
మాకు చెప్పండి..
విద్యుత్ శాఖ పనులు ఎక్కడ చేసిన నాణ్యత లోపించినట్లయితే మాకు తెలియజేయండి. పూర్తిస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించేలా చూస్తాం.
పీవీ రమేష్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ, మహబూబ్ నగర్ జిల్లా.