పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సురేశ్
సంగారెడ్డి, జూలై 24 (విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెలో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సురేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో 30శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా నాయకులను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. బుధవారం సురేష్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. విద్యారంగానికి బడ్జెట్‌లో 30శాత నిధులు కేటాయించి, పెం డింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని కోరారు. విద్యా రంగా సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామన్నారు. అరెస్టయిన వారిలో పీడీఎస్‌యూ జిల్లా ప్రధా న కార్యదర్శి నర్సింహారెడ్డి, నాయకులు సిద్ధు, ఆకాశ్, షమీ, శివ ఉన్నారు.