calender_icon.png 31 October, 2024 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఆర్‌ఆర్‌లో మరో 30 ఎస్టీపీలు

14-07-2024 05:51:48 AM

  • మురుగు శుద్ధిపై జలమండలి దృష్టి 
  • 3 ప్యాకేజీల్లో అమృత్ నిధులతో నిర్మాణం 
  • అంచనా వ్యయం రూ.2758 కోట్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో ఉత్ప త్తి అవుతున్న మురుగును శుద్ధి చేసేందుకు హైదరాబాద్ జలమండలి మరింత దృష్టి సారించింది. ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తూ మురుగు నిర్వ హణ బాధ్యతలను చూస్తున్న జలమండలి.. నగరంలోని  ఓఆర్‌ఆర్ పరిధిలో కొత్తగా మరో 30 ఎస్టీపీలను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం నగరంలోని ఎస్టీపీలకు తోడు మరో 3 ప్యాకేజీల్లో రూ.2,758కోట్లతో కొత్త ఎస్టీపీలను నిర్మించాలనే లక్ష్యంతో ముందు కు సాగుతోంది. 

పీపీపీ పద్ధతిలో నిర్మాణం

గతంలో జీహెచ్‌ఎంసీ పరిధి వరకే ఉన్న జలమండలి సేవలు ప్రస్తుతం ఓఆర్‌ఆర్ పరిధి సహా పలు మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా విస్తరించాయి. గత ప్రభుత్వం రెండేళ్ల క్రితం నగరంలో 61 ఎస్టీపీలను నిర్మించాలని నిర్ణయిం చింది. అయితే వాటిలో కేవ లం 31 ఎస్టీపీల నిర్మాణం పను లు మాత్రమే ప్రారంభమయ్యాయి. రూ. 3,866.41 కోట్లతో, 3ప్యాకేజీల్లో పనులు ప్రారంభమయ్యాయి. వివిధ కారణాలతో ఆ ఎస్టీపీల్లో 9 ప్రారంభం కాలేదు. కొత్తగా 3ప్యాకేజీల్లో 30 ఎస్టీపీల పనులు చేపట్టే యోచనలో జలమండలి అధికారులున్నారు. వీటితో పాటు రెండేళ్ల క్రితం ప్రారంభానికి నోచుకోని వాటిని కూడా కలుపుకొని మొత్తం 39 ఎస్టీపీలను నిర్మించాలని జలమండలి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ఓఆర్‌ఆర్ పరిధిలో కొత్తగా నిర్మించబోయే వాటిలో ప్యాకేజీ రూ.1,095కోట్లతో 10ఎస్టీపీలు, ప్యాకేజీ రూ.700కోట్లతో 6, ప్యాకేజీ రూ.962కోట్లతో 14 ఎస్టీపీలను అమృత్ నిధులతో నిర్మించబోతున్నారు. అమృత్‌లో భాగంగా పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో పనులు చేపట్టబో తున్నారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం 25శాతం , రాష్ట్ర ప్రభుత్వం 35శాతం, ప్రైవేటు ఏజెన్సీలు 40శాతం వ్యయంతో పనులు చేపట్టేలా యోచిస్తున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 

మిగతా నగరాల కంటే మెరుగైన స్థానం

ప్రస్తుతం ఓఆర్‌ఆర్ వరకు 1950ఎంఎల్‌డీల మురుగు ఉత్పత్తి అవుతోంది. జీహెచ్‌ఎంసీలోనే 1650ఎంఎల్డీలుగా ఉం ది. గతంలోనే 25ఎస్టీపీల ద్వారా రోజుకు 772 ఎంఎల్డీల మురుగు శుద్ధి జరిగేది. మొ త్తం మురుగులో ఇది 46శాతం. రెండేళ్ల క్రి తం నిర్మాణం చేపట్టిన మరో 22ఎస్టీపీల పనులు ముగింపుదశలో ఉన్నాయి.  ఇవి వినియోగంలోకి వస్తే 70శాతం మురుగు శు ద్ధి అవుతుంది. అయితే కొత్తగా నిర్మాణం చే పట్టబోయే 39ఎస్టీపీలు నిర్మాణం పూర్త య్యి వినియోగంలోకి వస్తే మరో 744ఎంఎల్‌డీల మురుగును శుద్ధి చేయొచ్చని అం చనా. 100శాతం మురుగును శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్ నిలిచే అవకాశం ఉంది.

ఎస్‌బీఆర్ టెక్నాలజీ వినియోగం

నగరంలోని పలు ఎస్టీపీల్లో ఎస్‌బీఆర్ టెక్నాలజీని వినియోగిం చారు. కొత్తగా చేపట్టబోయే ఎస్టీపీల్లోనూ ఈ టెక్నాలజీని వినియోగించబోతున్నా రు. దీనిద్వారా తక్కువ సమయం లో ఎక్కువ మురుగును మెరుగైన పద్ధతుల్లో శుద్ధి చేసే అవకాశం ఉంటుం ది. మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి గార్డెనింగ్, ఆర్‌సీఎం ప్లాంట్లకు వినియోగించుకోవచ్చు. ఎస్టీపీల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. వ్యర్థాలను ఎరువులుగా ఉపయోగించే అవకాశం ఉంటుంది.