అలంపూర్, నవంబర్ 17: కుక్క దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన అలంపూర్ పరిధిలోని మానోపాడు మండలం జల్లాపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. రాముడుకు చెందిన గొర్రె పిల్లలను ఓ రైతు పొలంలో కంచే వేసి అందులో ఉంచాడు. కుక్క ఒక్కసారిగా మందపై దాడి చేయడంతో 30 గొర్రె పిల్లలు మృతి చెందాయి. వాటి విలువ రూ.1.50 లక్షల వరకు ఉంటుదని రాముడు తెలిపారు.