calender_icon.png 11 March, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

౩౦ కిలోల గంజాయి పట్టివేత

11-03-2025 12:03:04 AM

సూర్యాపేట మార్చి 10 : సుమారు రూ. 30 లక్షలు విలువ చేసే ముప్పు కిలోల గంజాయిని పట్టుకొని  మునగాల పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించి వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సనును అలియాస్ శ్రీను ఆ రాష్ట్రానికి చెందిన పరిచయస్తుడైన పూర్ణా అనే మరో వ్యక్తి నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఎక్కువ మొత్తానికి విక్రయించాలని అనుకుని మునగాల సమీప ప్రాంతం వరకు వచ్చి, ఇక్కడి నుంచి హైదరాబాద్ కు మరో వాహనంలో గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. నిందితుడి నుంచి ఒక రూ. 5 వేల విలువ గల చరవాణిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.