28-04-2025 12:09:05 AM
లారీతోపాటు.. ముగ్గురు వ్యక్తుల అరెస్ట్..
బూర్గంపాడు,ఏప్రిల్ 27(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలోని ఐటిసి పార్కింగ్ యార్డ్ లో లారీ లోంచి 30 కేజీల గంజాయిని హైదరాబాద్ కు చెందిన ఎస్ టి ఎఫ్ బి టీం ఎక్సైజ్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఐటిసి పేపర్ మిల్లు కోసం అవసరమైన ముడి సరుకు కర్రను తీసుకువస్తున్న లారీ డ్రైవర్ శివ ఒరిస్సా నుంచి గంజాయిని తరలిస్తున్న అర్జున్ అనే వ్యక్తిని ఎక్కించుకొని లక్ష్మీపురం తీసుకువచ్చాడు.
ఈ సమాచారం అందుకున్న హైద రాబాద్ ఎస్టిఎఫ్ బి టీం ఎస్త్స్ర నాగరాజు మిగతా సభ్యులు కలిసి ఐటిసి పార్కింగ్ యార్డులో నిలిచి ఉన్న లారీని తనిఖీలు చే యగా అందులో 30 కేజీల గంజాయి పట్టుబడినట్లు ఎస్త్స్ర బాలరాజు తెలిపారు. డ్రైవర్ శివ తో పాటు గంజ్ ఒరిస్సా కు చెందినటువంటి అర్జున్ గంజాయి వ్యాపారి కలిసి ప లుమార్లు ఒరిస్సా నుంచి గంజాయిని తీసు కు వచ్చి భద్రాచలంలో అమ్మకాలు చేస్తున్నట్లు విచారణలో నిందితులు అంగీకరిం చారు.
ఎప్పటి లాగానే ఈసారి కూడా తీసుకువచ్చినటువంటి గంజాయిని ఎస్టిఎఫ్ పో లీసులు పట్టుకోవడంతో గంజాయి అక్రమ రవాణా దారుల గుట్టురట్టు అయింది. పట్టుకున్న గంజాయి విలువ రూ.15 లక్షలు, సీజ్ చేసినటువంటి లారీ విలువ 20 లక్షలు ఉంటుందని,డ్రైవర్ శివ గంజాయిని తీసుకొచ్చిన అర్జున్ మరో వ్యక్తి ప్రహ్లాదును గంజా యిని,లారీని భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్త్స్ర బాలరాజు తెలిపారు. గంజాయి పట్టుకున్నటువంటి ఎస్టిఎఫ్ బీ టీం ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి వి కమలహాసన్ రెడ్డి, బీ టీం ఇంచార్జ్ ప్రదీప్ రావులు అభినందించారు.