calender_icon.png 30 October, 2024 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పన్నుల ద్వారా 34 వేల కోట్ల ఆదాయం

02-08-2024 01:25:24 AM

  1. ఖజానాకు వార్షిక అంచనా ఆదాయంలో ఇది 25 % 
  2. మొదటి త్రైమాసిక ఆదాయ, వ్యయాలపై ‘కాగ్’ నివేదిక 
  3. మూడు నెలల్లో రూ.13 వేల కోట్లు అప్పులు 
  4. వడ్డీలకు దాదాపు 6 వేల కోట్ల చెల్లింపు

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): తెలంగాణ మొదటి త్రైమాసిక ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను గురువారం కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించింది. ఏప్రిల్, మే, జూన్ లో పన్నుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.34,609 కోట్ల ఆదాయం వచ్చినట్లు కాగ్ పేర్కొన్నది. రాష్ట్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వార్షిక ట్యాక్స్ రెవెన్యూ లక్ష్యం రూ.1,38,181 కోట్లు కాగా కాగ్ రిపోర్ట్ ప్రకారం మొదటి త్రైమాసికంలో వార్షిక లక్ష్యంలో 25శాతం సాధించినట్లు లెక్క. రాబడులు మరో రూ.35,609 కోట్లు ఉం టాయని ప్రకటించింది. ఇది వార్షిక అంచనాల్లో 16 శాతం.

ఆదాయం ఇలా..

మూడు నెలల్లో జీఎస్టీ ద్వారా రూ. 12,536 కోట్లు, ల్యాండ్ రెవెన్యూ ద్వారా రూ.3,449 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా రూ.4,785 కోట్ల ఆదాయం వచ్చినట్లు కాగ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేంద్రం నుంచి పన్నుల వాటా కింద రూ.3,635 కోట్లు వచ్చినట్లు వివరించింది. గత ఏడాది మొదటి త్రైమాసికానికి కేంద్రం రూ.1,811.52 కోట్ల గ్రాంట్స్ విడుదల చేయ గా, ఈసారి రూపాయి కూడా విదిల్చకపో డం శోచనీయం. మొదటి త్రైమాసికంలో ప్రభుత్వం రూ.13,171 కోట్ల అప్పులు చేసిందని, అప్పుల వడ్డీలకు రూ.5,933.5 కోట్లను చెల్లించినట్లు కాగ్ రిపోర్టులో తేలింది. వేతనాలకు రూ.11,026.69 కోట్లు, పెన్షన్లకు రూ. 4,311.62 కోట్లు, రాయితీలకు రూ. 3,354.21  కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ద్రవ్యోలోటు రూ.13,171కోట్లు ఉన్నట్లు తెలిపింది. 

గతేడాది కంటే.. తగ్గిన రాబడి..

కాగ్ నివేదిక ప్రకారం 2023 మొద టి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికంలో రాబడి దాదాపు రూ.2 వేల కోట్ల వరకు తగ్గింది. గతేడాది ఏప్రిల్, మే, జూన్ లో రూ.50,910.11 కోట్లు ఉండగా, ఈ సారి రూ. 48,790.66 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. 2024 వార్షిక  అంచనాల్లో ఇది 16 శాతం. అలాగే, సేల్స్ పన్ను ద్వారా రూ.8,202 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా రూ.వెయ్యి కోట్ల రాబడి వచ్చింది.