26-03-2025 01:58:09 AM
మునగాల మార్చి 25: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని మెద్దుల చెరువు స్టేజి వద్ద ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ సిబ్బందితో వాహానాలు తనిఖీ చేస్తుండగా ఒక అశోక్ లీలాండ్ కోదాడ వైపు నుండి హైదరాబాద్ వెళ్తుండగా దానిని ఆపి తనిఖీ చేయగా దాని నిండుగా బియ్యం బస్తాలు వున్నవి.
వాటి గురించి డ్రైవర్ ను అడుగగా ఇట్టి బియ్యం ప్రభుత్వ పంపిణీ బియ్యం తమ్మరబండపాలెం గ్రామంలో రాయపూడి జానకీరాములు వద్ద 35 క్వింటాల ప్రభుత్వ బియ్యం లోడ్ వేసుకొని సిద్దిపేట టౌన్ లో సంజయ్ అనే వ్యక్తికి తీసుకెళ్తున్నట్లుగా చెప్పినాడు. అశోక్ లీలాండ్ వాహనము , డ్రైవర్ ఆకుల మహిపాల్ తండ్రి బాలనర్సయ్య. పై కేసు నమోదు చేశారు.
అదేఅదేవిధంగా రెండు ఇసుక ట్రాక్టర్లను సీల్ చేశారు కొండ వీరయ్య తండ్రి చుక్కయ్య, ఓనర్ మేకరబోయిన ఉప్పయ్య యొక్క ట్రాక్టర్ లో ఉండ్రు గోండ గ్రామ శివారులో పాలేరు వాగు నుండి అక్రమంగా ఇసుకను రేపాల గ్రామం తరలిస్తుండగా పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి కేసు నమోదు చేయనైనది.
మల్లెల శ్రీను తండ్రి పిచ్చయ్య, కత్తి గోపి తండ్రి శివయ్య ఇద్దరు ట్రాక్టర్ లో కోదాడ మండలం కొత్తగూడెం గ్రామ శివారులో పాలేరు వాగు నుండి అక్రమంగా ఇసుకను మునగాల గ్రామం తరలిస్తుండగా పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి కేసు నమోదు చేశామని ఎస్‌ఐ బి. ప్రవీణ్ కుమార్, అన్నారు.