* 100 మందికిపైగా గల్లంతు
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడటంతో 38 మంది మృతిచెందారు. కాగా ఈ ఘటనలో 100 మం దికిపైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. కెపాసిటీకి మించి ప్రయాణికులను తరలిస్తుండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పడవలో 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వారంతా క్రిస్మస్ వేడుకల కోసం సొంతూళ్లకు వెళ్తుండగా పడవ బోల్తా పడిం ది. గల్లంతైన వారిలో ఇప్పటివరకు 20 మందిని రక్షించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా రు. నాలుగురోజుల క్రితం సైతం ఓ నదిలో పడవ బోల్తా పడి 25 మంది మృతిచెందా రు. ఈ క్రమంలోనే మరో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించొద్దని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా పట్టిం చుకోకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.