25-03-2025 01:29:55 AM
గద్వాల, మార్చి 24 ( విజయక్రాంతి): ప్రజావాణి స్వీకరించిన దరఖా సత్వరమే పరిష్కరిం అధికారులు చర్య చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు. సోమవారం సమీ జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సమర్పించిన దరఖాస్తులను జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగ రావు లతో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 38 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.