calender_icon.png 25 April, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాహం దాహం

25-04-2025 02:44:54 AM

  1. పట్టించుకోని ఆర్టీసీ 
  2. గోపాల్ పేట బస్టాండ్ లో 
  3. సమయానికి బస్సులు రాక ఇబ్బంది పడుతున్నప్రయాణికులు 
  4. బస్టాండ్ ఆవరణలో చలివేంద్రంఏర్పాటు చేయాలి

గోపాల్ పేట ఏప్రిల్ 24: గోపాలపేట మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ లో ఆర్టీసీ అధికారుల మెయింటెనెన్స్ లేక ప్ర యాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వేస వి కాలం తీవ్రంగా ఉండడంతో బస్ స్టాండ్ లో తాగునీరు లేక ప్రయాణికులు అవస్థలకు గురవుతున్నారు దాహం దాహం అంటూ కూల్ డ్రింక్స్ షాపులను కూల్ డ్రింక్స్ షాపులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది డబ్బులు డబ్బులు లేనివారు దా హంతో బస్సు వచ్చేవరకు పడుకో పడిగా కాపులు కాస్తున్నా రు.

అంతేకాకుండా సమయానికి హైదరాబాద్ బస్సులు రాక ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బస్టాం డ్ ఆవరణలో ప్రతి యేట చలివేంద్రం ఉండేదని ఈసారి లే నందువల్ల ఎండ తీవ్రతతో దాహాన్ని తట్టుకోలేకపోతున్నామని ప్రయాణికులు  ఆవేదన వ్యక్తపరిచారు.  గతంలో హైద రాబాద్ వెళ్ళుటకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉండేదని ఇప్పుడు గంటల తరబడి నిలబడవాల్సి వస్తుందని ప్రశ్నించుకుంటున్నారు.

గోపాల్ పేట నుండి హైదరాబాద్ వెళ్ళుటకు చుట్టూ గ్రామాలైన చెన్నూరు, పోలికే పాడు, చాకలి పల్లి, ఏదుట్ల, కేశంపేట, చెన్నారం, గొల్లపల్లి, చీర్కపల్లి,  ఏదుల ,అ నంతపురం,  రేమద్దుల సింగయిపల్లి, రాజాపూర్ , మైలారం, తుర్కదిన్నె, ముతిరెడ్డి పల్లి, నాగులపల్లి, గ్రామాల ప్రజలు గోపాల్ పేటకు వస్తుంటారు.

ఇంతకుముందు ప్రయాణికుల సౌకర్యార్థము గోపాల్ పేట బస్టాండ్ లో ఒక కండక్టర్ ని ఉంచేవారు. ఇప్పుడు వారిని కూడా తీసివేయడంతో ప్రయాణికులు బస్సుల సమయపాలన తెలవక అయోమయంలో పడుతున్నారు. ఒకప్పుడు హైదరాబాదు వెళ్లే ఎక్స్ ప్రేస్ , డీలక్స్, సూపర్ లగ్జరీలు గోపాల్ పేట నుంచే వెళ్ళేవి .

ఇప్పుడు కిలోమీటర్స్ రావాలనే దృష్టితో ఆర్టీసీ అధికారులు కొన్ని బస్సులను వయా కొత్తకోట నుండి పంపిస్తున్నారు. ఇలా బ స్సుల షాటేజీ కావడం వలన ప్రయాణికులు గోపాల్ పేట బ స్టాండ్ లో హైదరాబాదు వెళ్ళుటకు ఎదురుచూస్తున్నారు. గోపాల్ పేట బస్టాండ్ లో ప్రయాణికులు ఎండ తీవ్రతను త ట్టుకోలేక,  దాహార్తిని తీర్చుకోలేక సతమతమవుతున్నారు.

ఇ ప్పటికైనా ఆర్టీసీ అధికారులు ప్రయాణికులపై దృష్టి సారించి బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేసి, హైదరాబాదు వెళ్లే బస్సులు సమయపాలనతో ఎక్కువ బస్సులు నడపాలని ప్రయాణికులు మండల ప్రజలు కోరుతున్నారు.

 హైదరాబాద్ బస్సు రాక అరగంట నిలబడ్డ పార్వతమ్మ (పసుపుల) 

నేను పెద్దకొత్తపల్లి మండలం పసుపుల గ్రామం నుంచి హైదరాబాద్ వెళ్ళుటకు గోపాల్ పేట కు వచ్చాను. హైదరాబాద్‌కు బస్సులు ఎక్కువ ఉంటాయని ఇక్కడికి వచ్చిన అరగం ట అయింది కానీ ఒక్క బస్సు రావటం లేదు. గతంలో మాదిరే హైదరాబాద్ వెళ్ళుటకు బస్సులు నడపాలని కోరుకుంటున్నా.

 డీలక్స్, సూపర్ లగ్జరీ లు కూడా గోపాల్ పేట నుంచే నడపాలి. రాము (గోపాల్ పేట). 

హైదరాబాద్ వెళ్ళుటకు గతంలో మాదిరిగా ఎక్స్ ప్రేస్  తో పాటు  డీలక్స్ లు సూపర్ లగ్జరీలు కూడా గోపాల్ పేట నుం చి నడపాలి. మహిళలకు ఎక్స్ ప్రేస్  లో ఫ్రీగా ఉండడం వలన పురుషులకు సీట్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాం. డీలక్స్ సూపర్ లగ్జరీ లు వేస్తే మాకు కొంచెం సులువుగా ఉంటుంది.

 గోపాల్ పేట బస్టాండ్ లో మెయింటెన్సు చూస్తాం: వేణుగోపాల్  వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్

గోపాల్ పేట బస్టాండ్ లో మెయింటెనెన్స్ లేని మాట వాస్తవమే ఇకనుంచి అలా జరగకుండా చూస్తాం. గతంలో మాదిరిగానే టైం ప్రకారం హైదరాబాద్ బస్సులను నడుపుతున్నాము. డీలక్స్ సూపర్ లగ్జరీలు మాత్రమే వయా కొత్తకో ట నుంచి పంపిస్తున్నాము . ప్రయాణికుల ఇబ్బందులు మా దృష్టికి రాలేదు ఇకనుంచి అలాంటి సమస్యలు రాకుండా చూస్తాం .