calender_icon.png 15 March, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-2 రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు...

11-03-2025 08:50:03 PM

కొల్చారం (విజయక్రాంతి): మారుమూల గ్రామంలో జన్మించి ప్రభుత్వ బడిలో విద్యాభ్యాసం చేసి నాస్తి విద్యా: సమంచక్షు:విద్యను మించిన కన్నులు లేవు అన్న చందంగా రాసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగంలో మొదటి లేదా రెండవ ర్యాంకు సాధిస్తూ ఎన్నో ఉద్యోగాలను వదులుకొని ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి విద్యార్థులలో స్ఫూర్తిని నింపి గ్రూప్ 2 లో రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు, మల్టీ జోనల్ స్థాయిలో మొదటి ర్యాంకును సాధించిన, జూనియర్ లెక్చరర్ గా బుధవారం నాడు ముఖ్యమంత్రిచే అపాయింట్మెంట్ లెటర్ అందుకుంటున్న అపర మేధావి అక్షర దివిటీగా తన విజ్ఞాన కిరణాలను విద్యార్థులకి పంచిన ఆచార్య సూర్యుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంసాన్ పల్లి సోషల్ ఉపాధ్యాయులు బిరాధర్ మనోహర్ రావుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.