calender_icon.png 15 November, 2024 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో మూడో దశ ఆంక్షలు

15-11-2024 01:56:37 AM

కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ప్రభుత్వం చర్యలు

నేటి నుంచి అమల్లోకి రానున్న కఠిన నిబంధనలు పాఠశాలలకూ సెలవులు 

ప్రకటించిన సర్కార్  ఆంక్షలు 

* జీఆర్‌ఏపీ ఆంక్షలు అమల్లో ఉండడంతో ఢిల్లీలో వచ్చే మార్పులు.. 

* భవన నిర్మాణ పనులు, కూల్చివేతలను నిలిపేస్తారు 

* అన్ని మైనింగ్ కార్యకలాపాలు బంద్ చేయనున్నారు 

* నాన్ ఎలక్ట్రికల్, నాన్ సీఎన్‌జీ, డీజిల్‌తో నడిచే బీఎస్6 కేటగిరీ కాని అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోనున్నాయి. 

* ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో 5వ తరగతి వరకు విద్యార్థులకు స్కూల్స్ బంద్

* వాణిజ్య వాహనాలు దేశ రాజధానిలోకి ప్రవేశించకూడదు. 

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఢిల్లీలో పరిస్థితులు రోజురోజుకూ మరింతగా దిగజారు తున్నాయి. వాయు నాణ్యత ప్రమాదకర స్థితికి చేరుకోవడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎమ్) కఠిన చర్యలకు దిగింది. నేటి నుంచి ఢిల్లీ నగర వ్యాప్తంగా స్టేజ్ ఆంక్షలకు ఉపక్రమించింది. నేటి ఉదయం 8 గంటల నుంచి స్టేజ్ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు కమిషన్ తెలిపింది. ఈ ఆంక్షలు అమల్లో ఉన్నపుడు బీఎస్3 వాహనాలు, డీజిల్‌తో నడిచే బీఎస్ 4 వాహనాలను ఢిల్లీ రోడ్ల మీదకు అనుమతించరు.

అంతే కాకుండా గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్‌బుద్ధనగర్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ వాహనాలకు అనుమతి లేదు. ఈ ఆంక్షలు అమల్లో ఉన్నపుడు నిర్మాణ పనులు కూడా చేసేందుకు వీలు లేదు. 

ఏమిటీ స్టేజ్ 

‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’నే జీఆర్‌ఏపీ అంటారు. ఇందులో ౩ స్టేజ్‌లు ఉంటా యి. గాలి నాణ్యత క్షీణతను బట్టి స్టేజెస్ మా రుతూ ఉంటాయి. ప్రస్తుతం ఢిల్లీలో ప్రమాదకర స్థితికి చేరుకోవడంతో స్టేజ్ ఆంక్షల ను విధించారు.  ఏక్యూఐ 401 మధ్య ఉన్నపుడు స్టేజ్ ఆంక్షలు విధిస్తారు. ఈ ఆంక్షలను పాటించని వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం కట్టే ప్రాజెక్టులకు మాత్రం ఎటువంటి నిబంధనలు వర్తించవు.