calender_icon.png 19 January, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా మూడో మహాసభ

25-08-2024 06:20:28 PM

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సంఘం  టిడబ్ల్యూజేఎఫ్

పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాలి

మూడోసారి జిల్లా అధ్యక్షులుగా ఐతబోయిన రాంబాబు గౌడ్, కార్యదర్శిగా బుక్క రాంబాబు ఎన్నిక 

సూర్యాపేట: టిడబ్ల్యుజేఎఫ్ మూడవ మహాసభలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య మాట్లాడుతూ... ప్రభుత్వాలు ఎన్ని మారిన రాష్ట్రంలో జర్నలిస్టుల జీవితాలు ఆగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని దీన్ని తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందని, దాడులను నిరోధించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా తాత్పర్యం చేశాయని,ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు హామీలు ఇచ్చి విస్మరిస్తున్నారని అన్నారు. జర్నలిస్టుల కుటుంబాల కోసం ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రత్యేక జీవ తీసుకువచ్చి అమలు చేయాలన్నారు. ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో మృత్యు వాత పడుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఎక్స్గ్రేషియా అమలు చేసి వారి కుటుంబానికి బాసరగా నిలవాలన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించి,జీతాలు ఇవ్వాలన్నారు. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలన్నారు.

అనంతరం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక... తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) జిల్లా అధ్యక్షులుగా ఐత బోయిన రాంబాబు గౌడ్,జిల్లా కార్యదర్శిగా బుక్క రాంబాబు, ఉపాధ్యక్షులుగా ఎస్ కే. జానీ, ధరావత్ రవీందర్ నాయక్, చల్ల రామారావు, సంయుక్త కార్యదర్శి ఎరుకల సైదులు గౌడ్, టేకుల సుధాకర్, వంగాల వెంకన్న, కుర్ర గోపి, బి శ్రీనివాస్, తొట్ల ఉపేందర్, కోశాధికారిగా పాల్వాయి యామిని, జిల్లా కార్యవర్గ సభ్యులుగా రావుల రాజు, లింగమూర్తి, శ్యామ్, జగదీష్, అజయ్, పరమేష్, గుడిపూడి ప్రభాకర్, రెడ్డి బిక్షం రూథర్, శంకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సలిగంటి పుల్లయ్య, పి వెంకట్ రెడ్డి, బత్తిని వెంకటేష్,నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా సట్టు శ్రీను, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా పాల్వాయి జానయ్యను, రాష్ట్ర కమిటీకి నాయిని శ్రీనివాసన్ పంపాలని కమిటీ తీర్మానించింది.