పారిస్: విశ్వక్రీడలో డోపింగ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు అథ్లెట్లు డోపింగ్ పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అథ్లెట్ డోపీలో పట్టుబడ్డాడు. అఫ్గానిస్థాన్‌కు చెందిన జూడో ప్లేయర్ మహ్మద్ సమీమ్ ఫైజాద్ నిషేధిత స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు తేలింది. తొలి బౌట్‌కు ముందు మహ్మద్ తన శాంపిల్ ఇవ్వగా.. డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలాడు. మహ్మద్ సమీమ్‌పై నిషేధం పడింది.