calender_icon.png 25 October, 2024 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజైన్లు సరిగ్గా లేవనే ఆరోపణలను అంగీకరిస్తారా..?

25-10-2024 06:22:42 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్‌ బహిరంగ విచారణ మూడోరోజు కొనసాగుతుంది. పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కాళేశ్వరం డిజైన్ సీఈ చంద్రశేఖర్ శుక్రవారం హాజరయ్యారు. బ్యారేజీల డిజైన్లకు సంబంధించి చంద్రశేఖర్ ను కమిషన్ పలు ప్రశ్నలు అడిగింది. డిజైన్ల కోసం తగిన జాగ్రత్తలు తీసుకున్నారా..?, డిజైన్లు సరిగ్గా లేవనే ఆరోపణలను అంగీకరిస్తారా..?, డిజైన్ల లోపం వల్లే పిల్లర్లు కుంగాయన్న ఆరోపణలపై కమిషన్ ప్రశ్నించింది.

అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొనే డిజైన్లు రూపొందించామని చంద్రశేఖర్ చెప్పారు. పిల్లర్ల డ్యామేజీకి డిజైన్లకు సంబంధం లేదని, సీడబ్ల్యూసీ ఐఎస్ కోడ్ నిబంధనల మేరకే డిజైన్లు రూపొందించామని కాళేశ్వరం డిజైన్ సీఈ చంద్రశేఖర్ పేర్కొన్నారు. బ్యారేజీల్లో నీరు నిల్వ చేయవచ్చని డీపీఆర్ లో ఉందా..? అని కమిషన్ ప్రశ్నించడంతో నీరు నిల్వ చేయవచ్చని డీపీఆర్ లో ప్రత్యేకంగా లేదని తెలిపారు. నిర్మాణాలకు అనుగుణంగా డిజైన్లు మార్చాలని కాళేశ్వరం సీఈ చెప్పారని చంద్రశేఖర్ వెల్లడించారు.