22-02-2025 04:40:51 PM
రామాయంపేట,(విజయక్రాంతి): కోనాపూర్ సొసైటీలో శనివారం మూడవ రోజు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా విచారణ అధికారి మాట్లాడుతూ... సొసైటీ మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి(Former Chairman of Society Devender Reddy), మాజీ సీఈఓ గోపాల్ రెడ్డితో పాటు సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ పంపు నిర్వాహకులను వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. వాళ్ల నుండి తీసుకున్న వివరాలు రికార్డులో ఉన్న వాటిని పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.