హాజరైన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్, జనవరి 7 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న నిర్మల్ ఉత్సవాలు మూడో రోజూ ఘనంగా జరిగాయి. మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు.
నిర్మల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు కలెక్ట ర్ అభిలాష అభినవ్‌ను అభినందించారు. ఈ ఉత్సవాలతో నిర్మల్ చరిత్ర నేటి తరానికి తెలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన కళాకారుల ప్రదర్శలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిశోర్‌కుమార్, ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పాల్గొన్నారు.