calender_icon.png 16 November, 2024 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అష్ట దిగ్బంధనంలో (వసూల్ రాజా) 'ఇనుముల'

19-09-2024 01:49:39 PM

ఒక్కొక్కటిగా బయట పడుతున్న సెటిల్మెంట్ లు...

మంథని పీఎస్ లో మూడో కేసు  నమోదు...

బాధితులు ఇంకా ఉంటే నిర్భయంగా బయటకు రావాలంటూ ఎస్ఐ రమేష్ పిలుపు

మంథనిలో ఆసక్తిగా చర్చించుకుంటున్న ప్రజలు

మంథని (విజయక్రాంతి): మంథనిలో (వసూల్ రాజా)మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సత్యనారాయణ అష్ట దిగ్బంధనంలో పడుతున్నారా? అంటే ఔననే అనుకుంటున్నారు. అతని సెటిల్మెంట్ లు ఒక్కొక్కటి బయటపడుతుండటం చూసి మంథని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు మంథనిలో ఎక్కడ చూసినా ఈ వ్యవహారంపైనే హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. . ఇన్నాళ్లు బాజాప్తుగా సెటిల్ మెంట్లు చేసిన మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల చుట్టూ మెల్లిగా ఉచ్చు బిగుస్తుంది. టాపిక్గా చర్చ జరుగుతోంది.

ఇన్నాళ్లు బాజాప్తుగా సెటిల్మెంట్లు చేసిన మంథని మాజీ ఉప సర్పంచి ఇనుముల సత్యనారాయణ చుట్టూ మెల్లిగా ఉచ్చు బిగుసుకుంటుందనే చెప్పవచ్చు. తాజాగా మంథని పోలీస్ స్టేషన్లలో మూడో కేసు నమోదు కాగా, ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా బయటకు రావాలంటూ స్వయంగా ఎస్ఐ  రమేష్ అభయం ఇస్తున్నారు. ఇప్పటికే రెండు దందాలు బయటకు వచ్చి పోలీస్ రికార్డులోకి ఎక్కిన వసూల్ రాజా మరో బాగోతం బయటపడటంతో, ఇంకా ఎన్నెన్ని సెటిల్మెంట్లు ఉన్నాయోనని అటు ప్రజలే కాదు... పోలీసులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకరకంగా పోలీసులు, ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా అతని బ్లాక్ మెయిల్ దందాలు బయటకు వస్తుండడం గమనార్హం.

మంథని ముత్తారం మండలంలోని రామకృష్ణాపూర్ కు చెందిన మాజీ సర్పంచ్ కుమారుడు బిరుదు శ్రీనివాస్  నిర్మించిన ఓ బ్యాంకెట్ హాలు నిర్మాణం విషయంలో ఈ వసూల్ రాజా అడుగుపెట్టి సెటిల్మెంట్ చేసిన మూడో సంఘటన బయటకు వచ్చింది. సూరయ్యపల్లి జీపీ పరిధిలో సర్వే నం.329లో  శ్రీనివాస్ బాంకెట్ హాల్ నిర్మాణం చేపట్టాడు. ఆ బ్యాంకెట్ హాలు నిర్మాణం సాఫీగా సాగాలంటే ఇనుముల సత్యనారాయణ తనకు రూ. 10 లక్షలు  ఇవ్వాలని లేదంటే మరోలా ఉంటుందని బెదిరించారు. ఆ క్రమంలో రావికంటి సతీష్ నే వ్యక్తి ఫిర్యాదు దారుడు శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి | ఇనుముల సతీశ్ గురించి నీకు పూర్తిగా తెలియదు, ఆయన అడిగిందంటే ఇవ్వాలని, మరో మార్గం లేదని అంటూ ఇంకా బెదిరింపులకు గురి చేశాడని, దీనితో సదరు శ్రీనివాస్ అతని స్నేహితుడి అకౌంట్ నుంచి రావికంటి సతీలకు రూ.5 లక్షలు పంపించాడు.

అక్కడితో ఆగకుండా గత ఆగస్టు నెలలో ఇనుముల గన్మెన్ తో రానికంటి సతీశ్  శ్రీనివాస్ వదకు వచ్చి మరో రూ. 5 లక్షలు ఇవ్వకపోతే కోర్టులో పిల్ వేసి బ్లాంకెట్ హాలు కూల్చివేయిస్తానని, ఇనుముల సతీశ్ గురించి నీకు పూర్తిగా తెలియదు, ఆయన అడిగిందంటే ఇవ్వాలి మరో మార్గం లేదు ంటూ ఇంకా బెదిరింపులకు గురి చేశాడు. దీనితో సదరు శ్రీనివాస్ అతని స్నేహితుడి అకౌంట్నుంచి రావికంటి సతీశ్కు రూ.5 లక్షలు పంపించాడు. అక్కడితో ఆగకుండా గత ఆగస్టు నెలలో ఇనుముల గన్ మెన్, రావికంటి సతీశ్ ఇద్దరు శ్రీనివాస్ వద్దకు వచ్చి మరో రూ.5 లక్షలు ఇవ్వకపోతే కోర్టులో పిల్ వేసి బాంకెట్ హాలు కూల్చివేయిస్తామని బెదిరించారు.

ఎట్టకేలకు బాధితుడు శ్రీనివాస్ మంథని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి  ఇంకా ఏమైనా సెటిల్మెంట్లు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని మంథని ఎస్.ఐ ప్రజలకు సూచించారు. ఇదిలా ఉండగా ఇటీవల మంథని పట్టణంకు చెందిన మల్లారెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు డిమాండ్ చేయగా తాను 2 లక్షలు ఇచ్చాననీ, మరో 3 లక్షల కోసం బెదిరిస్తున్నాడంటూ మల్లారెడ్డి సాహసం చేసి మంథని పోలీసులకు ఫిర్యాదు చేయగా స్టేషన్లలో కేసు నమోదు చేశారు. అలాగే నిన్నటికి నిన్న రామగిరి మండలం కల్వచర్లకు చెందిన రియల్ వ్యాపారి తిరుపతి వద్ద రూ.10లక్షలు వసూలు చేసిన సంఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనితో పోలీస్ రికార్డులకు ఎక్కడంతో చట్ట ప్రకారం ఉన్నతాధికారులు ఇనుముల సత్యనారాయణ గనమెన్ ను పక్కకు పెట్టారు. దీనితో సామాన్య ప్రజలు, అతని బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి అతని చిట్టాను విప్పుతుండటం ఆసక్తికరమైన సంఘటనలు బయటకు వస్తున్నాయి. మంథని పట్టణంలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్పై చర్చించుకుంటున్నారు.