calender_icon.png 8 November, 2024 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ దృక్పథంతో ఆలోచించండి

31-08-2024 02:01:11 PM

-ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మనుషులు శాశ్వతం 

-విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ నేతలు కోరమోని నరసిహులు, జంబులయ్య, శివరాజ్

మహబూబ్ నగర్: సరిగ్గా గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.. వృద్ధులు, వికలాంగులు, ఆథులు అందులో నిర్మించుకున్న ఇండ్లను ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేసి వాళ్ళని ఫంక్షన్ హాల్లో ఉంచి అన్నం పెడతాం అని చెప్పడం ఎంతవరకు సమంజసమని టిఆర్ఎస్ నేతలు కొరముని నర్సింలు జంబులయ్య , శివరాజ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఇబ్బందుల గురిచేయడం ఎంతవరకు సమంజసంమన్నారు. కేవలం రాజకీయ పోరాటాలు రాజకీయ లబ్ధి చేసేందుకు నిరుపేదలను ఇబ్బందులకు గురి చేయకూడదని తెలిపారు.

మీతో అధికారం ప్రభుత్వం ఉంది విచారణ చేయండి దళారులు ఉంటే వాళ్లపై చర్యలు తీసుకోండి అంతేకానీ ఇష్టమైన సడగా మాట్లాడి నిరుపేదలను ఇబ్బందుల గురి చేయకూడదని హెచ్చరించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అతని తమ్ముని టార్గెట్ చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. నిరుపేదలకు అన్నం పెడితే ఉరువలేని మీరు ప్రజలకు మంచి చేస్తారని అంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. నిరుపేదలను ఇబ్బందుల గురించి చేస్తే మీకు కలిగే సంతృప్తి ఏందో ప్రజలకు గమనిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని నిరంతరం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాలని సంకల్పంతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజకీయాల్లోకి రావడం జరిగిందని ఈ విషయాన్ని గమనించాలన్నారు.

ప్రజలకు మంచి చేయాలని తపన ఉంటే మంచి చేయాలి కానీ ఇప్పటివరకు దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నా వారు చేసింది ఏంటో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఫేక్ సర్టిఫికెట్లు ఉంటే పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటే సరిపోతుందని ఇష్టను సారంగా ఎవరిపై పడితే వారిపై చర్యలు తీసుకొని నీరసరాలను చేస్తూ ముందుకు సావడం సరైన విధానం కాదన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు అనంతరెడ్డి, తదితరులు ఉన్నారు.