calender_icon.png 24 December, 2024 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాట అనే ముందు ఆలోచించండి..

06-11-2024 12:00:00 AM

సమంత మయోసైటిస్ వ్యాధికి చికిత్స చేయించుకుని ఇటీవలి కాలంలో అటు సామాజిక మాద్యమాల్లోనూ.. ఇటు పలు షోలలోనూ యాక్టివ్ అయిపోయింది. అయితే ఆమె తాజాగా చాలా స్లిమ్‌గా కనిపిస్తున్నారు. ఇది కొంత మందికి నచ్చడం లేదు. మరీ చిక్కితే చూసేందుకు అంత బాగా అనిపించడం లేదని నెటిజన్ల కామెంట్. ‘ఖుషి’ చిత్రం విడుదలైన సమయంలోనే సమంతపై కొందరు కామెంట్స్ చేశారు.

ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అంత బాగోలేవంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆమె లుక్స్ విషయంలో అభిమానులు ఒకింత డిజప్పాయింట్ అవుతున్నారు. ప్రస్తుతం సిటాడెల్ హనీ  బన్నీ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో డోస్ పెంచారు. దీనిలో భాగంగానే సమంత నెటిజన్లతో చిట్ చాట్ చేశారు. ఓ ‘నెటిజన్ కాస్త బరువు పెరగండి మేడమ్’ అంటూ కామెంట్ చేశాడు.

ఇది సమంతకు విపరీతంగా కోపం తెప్పించింది. “నా బరువు గురించి నాకు తెలుసు. ప్రస్తుతం నేను యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో ఉన్నా. నా బరువు నా అదుపులోనే ఉంది. నా ఆరోగ్యం దృష్ట్యా కూడా ఇదే బరువును నేను కొనసాగించాలి. దయచేసి ఎవరినైనా మాట అనే ముందు కాస్త ఆలోచించండి” అని గట్టిగానే ఇచ్చిపడేశారు.