అధికారులు ఆదేశించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్...
భద్రాచలం (విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్న ఏర్పాట్లు ఈనెల 7 తేదీ నాటికి పూర్తి కావాలని, భక్తులు ఇబ్బందులు పడకుండా సంబంధిత అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jithesh V Patil) అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్లో ముక్కోటి ఏర్పాట్లపై జరుగుతున్న పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిఐపిలకు వీఐపీలకు వేరువేరుగా భారీ కేడ్లతో పాటు పాటు వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులు ఇబ్బందులు పడకుండా శానిటేషన్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తులు పడవేసే వ్యర్థ పదార్థాలు ఎక్కడపడితే అక్కడే పడి వేయకుండా డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని, గ్రామపంచాయతీ సిబ్బంది భద్రాచలం పట్టణం మొత్తం శుభ్రంగా ఉండేలా చూడాలని, ఘాటులో, సారపాక నుండి భద్రాచలం పార్కింగ్ ప్రదేశాల వరకు విద్యుత్ కాంతులతో వెదజల్లాలని, దేవస్థానములో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు తొక్కిసలాట జరగకుండా పోలీసు దేవస్థానం సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా చూడాలని, మంచినీటి సౌకర్యం కొరకు 20 ప్రదేశాలలో ఏర్పాటులు చేయాలని, నాలుగు వాటర్ ట్యాంకర్లు ఎప్పటికప్పుడు గస్తీ తిరుగుతూ ఉండాలని, అధికారులు, పోలీస్ సిబ్బంది వారి బంధువులకు ఫ్యామిలీలకు స్వామివారి దర్శనానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా భక్తులకు మాత్రమే దర్శనం చేసుకునేలా చూడాలని, ప్రస్తుతం నిర్మిస్తున్న 138 టాయిలెట్లతో పాటు మొబైల్ టాయిలెట్లు ఎక్స్ట్రా తెప్పించాలని, 8, 9,10, తేదీలలో మెయిన్ ఫెస్టివల్ గా పరిగణిస్తున్నందున ఏడో తేదీ నాటికి అన్ని పనులు పూర్తి కావాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
ముఖ్యంగా భక్తులు అస్వస్థతకు గురి అయితే వెంటనే వైద్య చికిత్సలు అందేలా ప్రత్యేక వైద్య కేంద్రాలతో పాటు అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. 9, 10 తేదీలలో మద్యం మాంసం దుకాణాలు పూర్తిగా బంద్ చేయించాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రోడ్లకు బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రివర్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహిస్తున్నందున దానిలో భాగంగా ఐటీడీఏ ద్వారా ఏర్పాట్లు చేసే కల్చరల్ ప్రోగ్రామ్స్ తెప్పోత్సవానికి ముందు ఆ తర్వాత నిర్వహించేలా చూడాలని, దాంతో పాటు ట్రైబల్ కల్చర్ కు సంబంధించిన కళాఖండాలు, గిరిజన వంటకాలు, కరక్కాయ పొడితో టీ తయారు చేయడం, ఔషధ గుణాలకు సంబంధించిన ఆహార పదార్థాల అమ్మకాల కొరకు ఏర్పాటుచేసిన స్టాల్స్ పర్యాటకులు సందర్శించి కొనుగోలు చేసేలా చూడాలని, దీని ద్వారా గిరిజనులకు ఉపాధి దొరికే అవకాశం ఉందని అన్నారు.
భక్తుల కొరకు ఏర్పాట్లు చేస్తున్న తాత్కాలిక విడిది వీడిది గృహాలలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, వచ్చే భక్తులు ఈ గృహాలలో బస చేసి కిన్నెరసాని, బొజ్జిగుప్ప, బెండలపాడు, ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం సందర్శించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. అనంతరం ఉత్తర ద్వార దర్శనం జరుగు ప్రదేశాలు, మిథిలా స్టేడియంలోని స్వామివారి పూజా కార్యక్రమాలు, తెప్పోత్సవం జరుగు ప్రదేశాలు, పార్కింగ్ ప్రదేశాలు, తాత్కాలిక విడిది గృహాలు, సెల్ఫీ పాయింట్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్, డి ఆర్ డి ఓ విద్యాచందన, దేవస్థానం ఈవో రమాదేవి, ఇరిగేషన్ డి ఈ వెంకటేశ్వర్లు, ఏఈ వెంకటేశ్వర్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.