26-04-2025 02:55:05 PM
ఆదర్శ రైతుల రాష్ట్ర అధ్యక్షులు కసిరబోయిన లింగయ్య యాదవ్
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలో ఏదో ఒక గ్రామంలో సన్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రభుత్వం ప్రారంభించాలని, ఆదర్శ రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కసిరబోయిన లింగయ్య యాదవ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తుంగతుర్తి మండలం లో సన్న వడ్ల కొనుగొలు కేంద్రం లేకపోవడం మూలంగా సన్నవడ్లు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఒకపక్క ప్రభుత్వం సన్న వడ్లు పండించండి బోనస్ ఇస్తామని పేర్కొంటూ మరోపక్క తుంగతుర్తి మండలంలో సన్న వడ్ల కొనుగోలు కేంద్రం లేకపోవడం చాలా బాధాకరమన్నారు.
మండలంలో సన్న ఒడ్లు పండించిన రైతులు పక్క మండలమైన మద్దిరాల కేంద్రానికి తీసుకువెళ్లటం అనేది రైతులకు చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని, దాదాపు 20 కిలోమీటర్లు మద్దిరాలకు వెళ్లడం అక్కడ పండించిన వడ్లను తూర్పాల పట్టడం మ్యాచర్ వచ్చేంత వరకు ఎండబెట్టడం చాలా సమస్యలతో కూడుకున్న పని కాబట్టి అధికారులు దీనిపై సత్వరమే స్పందించి తుంగతుర్తి మండలం లో రావులపల్లి వెంపటి గొట్టిపర్తి ఎన కుంట తండా మానాపురం తూర్పు గూడెం ఈ విలేజ్ మధ్యలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నారు