08-04-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం ప్రతిష్టాత్మక నిర్ణయ మని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా అనంతరం గ్రామంలో సోమవారం రేషన్ షాపు నుండి ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం గ్రామంలో గార్లపాటి శ్రీనివాస్ మంగమ్మ దంపతుల ఇంట్లో ఏర్పాటుచేసిన సహపంక్తి భోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు డీ సీ సీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్, కంకర అయ్యప్ప రెడ్డి పాల్గొన్నారు.