calender_icon.png 30 March, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగాది నుంచి సన్నబియ్యం!

27-03-2025 12:20:33 AM

  1. 30న సీఎం చేతులమీదుగా పంపిణీ కార్యక్రమం
  2. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా..
  3. కాళేశ్వరంపై రిపోర్టులు వచ్చాక బాధ్యులపై చర్యలు
  4. శాసన సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటన

హైదరాబాద్, మార్చి 26(విజయక్రాంతి): ఈనెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపి ణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రేషన్ షాపుల్లో మరిన్ని నిత్యావసర వస్తువులను కూడా ప్రారంభిస్తామన్నారు.

అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు లేవనెత్తిన అంశాలపై ఆయన మాట్లాడారు. ఎమ్మె ల్యేలు కూడా ఆయా నియోజక వర్గంలో దీన్ని ప్రారంభించాలని కోరారు. దేశ చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువస్తు ఆహారభద్రత కోసం ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం తమకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు.

రాష్ర్టంలో 84 శాతం మందికి మనిషికి 6 కిలోల చొప్పున మంచి రకం సన్న బియ్యం ఉచితంగా అందించబోతున్నామని, ఇది స్వతంత్ర భారత దేశ చరిత్ర లో విప్లవాత్మక మార్పు అన్నారు. రాష్ర్టంలో 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామని, అయితే రేషన్ షాపులలో ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని 80 శాతం మంది లబ్ధిదారులు ఉపయోగించడం లేదని 7, 8 వేల కోట్ల రూపాయల బియ్యం పంపిణీ జరిగితే లబ్దిదారులు వాడకపోవడంతో అవి పక్క దారి పడ్తున్నాయన్నారు.

పేదలు కడుపునిండా తినే విధంగా మంచి నాణ్యమైన సన్న రకం బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించామ న్నారు. రాష్ర్టంలో 89 లక్షల కార్డులు ఉన్నాయని, ఇటీవల జరిగిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలలో అదనపు సభ్యుల ను తీసుకున్న వారందరికీ బియ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవుతుందని, రేషన్ కార్డులు కొత్తవి వచ్చే వరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి బియ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 

రిపోర్ట్ వచ్చాక చర్యలు..

ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు, జ్యూడీషియల్ కమిషన్ ఘోష్ నివేదిక వచ్చాక కాళేశ్వరం కుం గుబాటుపై చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు అప్పులను షార్ట్ టైం, లోన్‌లకు ఎక్కువ ఇం ట్రెస్ట్‌కు తీసుకు వచ్చిందన్నారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని, తక్కువ నిధులతో త్వరగా పూర్తయ్యి ఆయకట్టుకు నిరందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా చేపట్టామన్నారు.

ప్రాణహిత విషయంలో నిర్లక్ష్యంలేదని, త్వరలోనే తుమ్మిడిహెట్టి వద్ద పను లు మొదలుపెడుతామన్నారు. తాము యుద్ధప్రాతిపదికన పనులుచేసి దేవాదుల పూర్తిచేశా మని, ఒకటి రెండు రోజుల్లో పంపింగ్ ప్రారంభిస్తామన్నారు. కాళేశ్వరం  పనులలో డిజైన్, నిర్మా ణం, మెయింటనెన్స్ లోపాలు, తేడాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.