02-04-2025 11:26:05 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలతో బుధవారం కన్నెపల్లి మండల కేంద్రంతో పాటు జనకాపూర్, జజ్జరవెల్లి వీరాపూర్, టేకులపల్లి, ముత్తాపూర్, మెట్టుపల్లి, నాయికుని పేట, లింగాల గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బెల్లంపల్లి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు వెంకట నర్సింగరావు ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పప్పుల రామాంజనేయులు, బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఏల్పుల రోహిత్ మాజీ కోఆప్షన్ సభ్యులు అంకుస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గురుండ్ల సాయి లు పాల్గొన్నారు.