- ప్రజా పాలన గ్రామసభల దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
- నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవు
- కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా చేసుకోవచ్చు
- ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, జనవరి 23 ( విజయక్రాంతి ) : రానున్న ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేయబడతాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి లు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘణ పురం మండలం సల్కేలాపురం గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని, నిరుపేదలకు అండగా నిలిచి ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి అందేలా చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగానే ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారని వారు పేర్కొన్నారు.
నేటి ఇందిరమ్మ రాజ్యంలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల ఫలాలు ప్రతి ఇంటికి అందుతాయని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారు సూచించారు. అధికారులు తయారుచేసిన జాబితాలో తమ పేరు లేదని ఎవరూ నిరాశ చెందరాదని, ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకో వచ్చునని ఇందుకు సంబంధించి ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ సైతం ఏర్పాటు చేసిందని, తమ దరఖాస్తులను ఆ నెంబర్కు పంపించవ చ్చునని వారు సూచించారు.
రూ 175 కోట్ల రూపాయలతో 3500 ఇండ్లను కేవలం వనపర్తి నియోజకవర్గానికి ప్రభుత్వం మంజూరు చేసిందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందుతాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటివరకు 16 మంది ముఖ్యమంత్రిలు పాలన కొనసాగించారని 64 సంవత్సరాల లో చేయలేని అప్పును కేవలం 10 సంవత్సరాల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని వారు వివరించారు.
రాయితీ పై సిలిండర్లు రాని అంశంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశ నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి రాయితీ సిలిండర్లు అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించేలా అధికారులు పనిచేయాలని అర్హులైన లబ్ధిదారులను కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు అధికారులను వారు హెచ్చరించారు.
తల్లిదండ్రులు వారి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అనవసరమైన ఖర్చులు పెట్ట కుండా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగించాల న్నారు. మామిడిమడ గ్రామ హరిత హోటల్ నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల కలెక్టర్, జిల్లా అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.