పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడి తల్లి
కౌంటర్‌గా తిరిగి ఫిర్యాదు చేసిన తీగల కుటుంబం
మహేశ్వరం, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే, టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ తీగల కృష్ణారెడ్డి ఫోన్‌కాల్ రికార్డ్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అయిం ది. ఓ యువకుడిని దూషిస్తూ బూతుపురాణం అందుకున్నారు. ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే తీగల కృష్ణారెడ్డి యువకుడిని ఆయన బెదిరించినట్లు తెలుస్తున్నది.
సదరు యువకుడి కుటుంబానికి, కృష్ణారెడ్డికి మొదటి నుంచీ సత్సంబంధాలు ఉన్నప్పటికీ, ఐదు నెలల నుంచి రెండు కుటుంబాలకు పడడం లేదని తెలిసింది. కృష్ణారెడ్డితో తన కుమారుడికి ప్రాణహాని ఉందని యువకుడి తల్లి బుధవారం మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన కుమారుడికి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నది. మరోవైపు తీగల కుటుంబ సభ్యులు కూడా యువకుడితో పాటు అతడి తల్లిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ విచారణలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.