సంగారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న బీదర్ పట్టణంలో పట్టపగలు ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి నగదుతో పరారయ్యారు. బ్యాంక్ సిబ్బందిపై కాల్పులు జరిపి నగదు తీసుకొని పారిపోగా, కాల్పుల్లో ఒక్కరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. వెంటనే బీదర్ పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జరిపిన వారికోసం వేట ప్రారంభించారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి ఆకస్మికంగా బ్యాంకు సిబ్బందిపై కాలపులు జరిపి డబ్బులతో పారిపోయారని పోలీసులు తెలిపారు.