calender_icon.png 16 April, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిలో హుండి పగలగొట్టి చోరీ చేసిన దొంగల పట్టివేత

14-04-2025 07:34:30 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఇటీవల రెండు గుడిలలో హుండీలు పగలగొట్టి చోరీ చేసిన కేసులో ఇద్దరు దొంగలను పట్టుకున్నట్లు ఖానాపూర్ సీఐ సిహెచ్ అజయ్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి, గతంలో అనేక నేర చరిత్రలు కలిగిన పెద్దపల్లి జిల్లాకు చెందిన మునుపటి రాజు, బొజ్జ రాజశేఖర్ అనే ఇద్దరు నిందితులు ఇటీవల ఖానాపూర్ డబుల్ బెడ్ రూమ్ వద్ద ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, అగ్గి మల్లన్న, ఆలయాల్లో చోరీ చేసి నగదు, వెండి ,బంగారము, దొంగతనం చేసిన కేసులో పోలీసులు ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ ఆధ్వర్యంలో చాక చక్యంగా వ్యవహరించి సోమవారం పెద్దపల్లి పట్టణంలో దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి  రూ.91, 500 సొమ్ము రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.