12-02-2025 12:15:54 AM
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో మళ్లీ దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాజాగా గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని కొండాపూర్ వెస్సేల్లా ఉడ్స్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలోకి సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో విల్లాస్ లోకి ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించారు.
అయితే వారి ప్రయత్నాలు విఫలం కావడంతో దొంగల ముఠా ప్రహరీగోడ దూకి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ గార్డులు దొంగలు ఎలా ప్రవేశించారని విల్లాస్ లో నివసిస్తున్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విల్లాస్ అసోసియేషన్ వారు మెయింటెనెన్స్ పేరుతో తమ దగ్గర ప్రతీ నెల రూ.25 వేల చొప్పున వసూలు చేస్తూ కనీసం సేఫ్టి అండ్ సెక్యూరిటీ కల్పించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.