ఏటీఎంలను ధ్వంసం చేసి నగదు అపహరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. బ్యాంకు ఏటీఎంను ధ్వంసం చేసి నగదు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆదివారం అర్ధరాత్రి ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలోకి చొరబడిన దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి రూ.20వేల నగదు ఎత్తుకెళ్లారు.
అలాగే సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంను సైతం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. సోమవారం ఉదయం పోలీసులు.. ధ్వంసమైన ఏటీంలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.