calender_icon.png 23 October, 2024 | 3:10 AM

పెద్దపల్లి పట్టణంలోని బంగారం షాపులో దొంగల హల్‌చల్

12-08-2024 02:25:04 PM

పెద్దపల్లి(విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ లో అనీలా జువెల్లరీ వర్క్ స్ షాపులో ఆదివారం రాత్రి దొంగలు హల్‌చల్  చేశారు. షెటర్ పైకి లేపి దొంగలు యదేచ్ఛగా దాదాపు 3 తులాల బంగారం, 1.5 కేజీల వెండి దోచుకెళ్లారు. ఉదయం షాపు వద్దకు వచ్చిన యాజమాని కీ షటర్ పగలగొట్టి ఉండటంతో అనుమానం వచ్చి పోలీస్ లకు సమాచారం అందించాడు. వెంటనే షాపు వద్దకు చేరుకున్న పోలీసులు షాపు తెరిచి చూడగా దొంగలు పడ్డారని నిర్దారణకు వచ్చారు. దీంతో యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.