26-04-2025 03:50:44 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో దొగల హాల్ చల్ చేస్తున్నారు. ఆలేరులోని కాశీనాథ్ జువెలరీ షాప్ లో కిలోన్నర వెండి, 5 గ్రాముల బంగారం చోరీ చేశారు. మోటకొండూరు మండలం మాటూరులో ఏడు ఇళ్లల్లో దొంగలు పడి రూ.2 లక్షలు, 115 తులాల వెండి ఎత్తుకెళ్లారు. అలాగే కొల్లూరులో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో రూ.30 వేల చోరీ జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.