calender_icon.png 21 December, 2024 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడలో దొంగల హల్చల్

16-09-2024 03:10:29 PM

కిరాణా దుకాణంతోపాటు గణపతి మెడలో ఉన్న డబ్బుల దండలు దొంగిలించిన దుండగులు

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆదివారం రాత్రి దొంగలు హల్ చల్ సృష్టించారు. బాన్సువాడ లోని చైతన్య నగర్ కాలనీలో ఓ కిరాణా షాప్ లో చట్టాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 50 వేలు వేలువచేసి వస్తువులను చోరీ చేశారు. అనంతరం పక్కనే ఉన్న వినాయక మండపంలోని వినాయకుని మెడలో ఉన్న డబ్బుల దండలు ఎత్తుకెళ్లారు. స్థానిక దుండగులు ఈ పని చేశారని స్థానికులు భావిస్తున్నారు. బాధితులు బాన్స్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తున్న బాన్సువాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.