28-03-2025 03:15:56 PM
10 తులాలకు పైగా బంగారు నగలు అపహరణ
తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకున్న దొంగలు
కామారెడ్డి జిల్లా బస్వాపూర్ లో దొంగల హల్చల్
కామారెడ్డి, (విజయ క్రాంతి): తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకున్న గుర్తు తెలియని దొంగలు 9 ఇండ్లలో చోరీలకు పాల్పడి బీభత్సవం సృష్టించారు. కామారెడ్డి జిల్లా(Kamareddy district) భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్రామంలో దొంగలు ఒకే రాత్రి 9 ఇండ్లలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. సుమారు 10 తులాల బంగారం నగలు లక్ష రూపాయల వరకు నగదు వెండి అభరణాలు గురువారం రాత్రి దోచుకెళ్ళారు. బాధితులు శుక్రవారం బిక్కనూరు పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బిక్కనూరు పోలీసులు క్లూస్ టీం ను రప్పించి 9 ఇండ్లలో వేలి ముద్రలను సేకరించారు. భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రోజు ఒకే గ్రామంలో 9 ఇళ్లలో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడడం జిల్లాలో నే ఇలాంటి ఘటన జరగడం మొదటిసారని గ్రామస్తులు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.