09-02-2025 03:17:29 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ కాంట్రాక్ట్స్ కాలనీలో శనివారం అర్ధరాత్రి దొంగల ముఠా హల్చల్ చేసింది. కాంటాక్ట్స్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు సంచరించి ఆరు ఇండ్లలో దొంగతనాలకు ప్రయత్నించారు. తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేస్తున్న అలజడి విన్న పరిసర ప్రాంతాల వారు లేచ్చారు. దీంతో దొంగలు పరారయ్యారు. దొంగల ముఠా కారులో వచ్చినట్లు సిసి కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కాలనీకి చేరి కాలనీవాసులకు కౌన్సిలింగ్ వచ్చారు. అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులకు సూచనాలు చేసి పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ సతీష్, ఎస్ఐ రాఘవయ్యలు పాల్గొన్నారు.