calender_icon.png 19 September, 2024 | 10:16 PM

వ్యక్తిపై దొంగల హత్యయత్నం

18-09-2024 09:15:05 PM

దొంగల బీభత్సవం

చావు బతుకుల్లో ఉన్న ఇంటి యజమాని

దాడి చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు

కామారెడ్డి జిల్లా బంజారా తండాలో దుండగుల బీభత్సవం

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని ఓ తండాలో గుర్తు తెలియని దుండగులు  ఇంట్లో చోరీకి పాల్పడడమే కాకుండా ఇంటి యజమానిపై దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఇంట్లో చోరీకి వచ్చిన దుండగులు ముగ్గురు బీరువా తాళం చెవులు ఇవ్వనందుకు ఇంటి యజమాని పై దాడి చేసి గాయపరిచారు.

అనంతరం బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు నగలు పుస్తెలతాడు చోరీ చేసుకుని వెళ్లారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బంజారా తండకు చెందిన మోహన్ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ఇంట్లో చొరబడ్డారు. మోహన్ అతని భార్య నిర్మల ఇంట్లో ఉండగా మోహన్ భార్య మెడలో ఉన్న మూడు తులాల  బంగారు పుస్తెలతాడు ను లాక్కున్నారు. ఇంట్లో బీరువా తాళం చెవులు ఇవ్వాలని కోరగా మోహన్ నిరాకరించారు. దుండగులు అతనిపై దాడి చేసి చాకుతో గాయపరిచారు.

దీంతో ఆందోళనకు గురైన మోహన్ భార్య నిర్మల బీరువా తాళం ఇవ్వగానే బీరువాల్లో ఉన్న బంగారు నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. మోహన్ మెడ పై తీవ్ర గాయాలు కాగా రక్తపు మడుగులో ఉండడంతో దుండగులు వెళ్లిన తర్వాత మోహన్ భార్య రోదించడంతో స్థానికులు వచ్చి గాయపడిన మోహన్ ను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగిరెడ్డిపేట పోలీసులకు సమాచారం అందించగా ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బుధవారం డాగ్ స్క్వా డును రప్పించారు. దొంగల వేలిముద్రలను సేకరించారు.

తీవ్ర గాయాలైన మోహనును చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సంఘటన ఈ ప్రాంతంలో మునిపెన్నాడు జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు పాల్పడింది మహారాష్ట్ర దొంగల ముఠ పని అయి ఉంటుందని భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.