బంగారు నగలు చోరీ
కామారెడ్డి, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి ): కామా రెడ్డి జిల్లాలోని ఓ తండాలో దుం డగులు ఇంట్లో చోరీ కి పాల్పడ మే కాకుండా ఇంటి యజమానిపై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి కా మారెడ్డి జిల్లాలో జరిగింది. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డి మండలం బంజారాతండాకు చెందిన మోహన్ ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి ముగ్గురు దుండగులు చొరబడ్డారు. మోహన్ భార్య నిర్మల మెడలో ఉన్న పుస్తెల తాడును లాక్కున్నారు.
బీరువా తాళంచెవి ఇవ్వాలని కోరగా మోహన్ నిరాకరించాడు. దీంతో అతడిపై దుండగులు కత్తితో దాడి చేసి గాయపరిచారు. ఆందోళనకు గురైన నిర్మల బీరువా తాళంచెవి ఇచ్చింది. దీంతో బీరువాలో ఉన్న బంగారు నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. దుండగులు వెళ్లిన అనంతరం మోహన్‌ను ఎల్లారెడ్డికి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి బుధవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ దాడికి పాల్పడింది మహారాష్ట్ర దొంగల ముఠా అని స్థానికులు అనుమానిస్తున్నారు.