- విలువైన టేకు వృక్ష సంపద మాయం
- ఇంటిదొంగల పనేనని అనుమానాలు
అశ్వారావుపేట, ఫిబ్రవరి 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన అటవీ పరిశోధనా కేంద్రంలో దొంగలు పడి విలువైన టేకు వృక్ష సంపదను దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేంద్రాన్ని అటవీ అధికారులు కొంతకాలంగా పట్టించుకోకపోవడంతో పరిశోధనా కేంద్రం అక్రమార్కులకు నిల మారింది.
ఎన్నో ఔషద మొక్కలతో కళకళలాడే కేంద్రం ఇపుడు పూర్తిగా శిథాలవస్థకు చేరింది. దీని పట్టించుకొనే నాథుడే కరువుయ్యాడు. ఈ అటవీ పరిశోధన కేంద్రంలో దశాబ్దాల కాలంగా పెరిగిన టేకు వృక్షాలు మాయమైన సంఘటన ఆల్యసంగా వెలుగులోకి వచ్చింది.
చెట్లు నరికి బయటకు తరలించే వ్యవహరంలో ఇంటి దొంగల పాత్ర ఉండొచ్చనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నా అటవీ పరిశోధనలు చేసేందుకు ఈ కేంద్రంలో దేశ విదేశాల నుంచి వివిధ రకాలైన మదర్ ప్లాంట్‌లను తెచ్చి నాలుగు దశాబ్దాల క్రితమే లక్షల రూపాయలు వెచ్చించి వంద ఎకరాల్లో మొక్కలు పెంచారు.
పరిశోధనా కేంద్రంలో టేకు, మద్ది, బండారు, వేగిశతోపాటు ఎంతో విలువైన మారుజాతి కలప, వెదురు వృక్షాలను పెంచారు. 20 హెక్టార్లలో టేకు, మూడు హెక్టార్లలో వెదురు విస్తరించి ఉంది. ఇక్కడ మేలు జాతి వృక్షాలతోపాటు పలు రకాలైన ఔషధ మొక్కలను అప్పట్లో నాటారు. రెండు దశాబ్దాలకు పైగా ప్రభుత్వాలు దీన్ని పట్టించు పరిశోధనా కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరింది.
ఒక ఇన్‌చార్జ్ రేంజ్ అధికారితో పాటు మరో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఇన్‌చార్జి అధికారి వరంగల్‌లో ఉంటారు. కేంద్రం నిర్వహణకు నిధులు రాక పూర్తి నిర్లక్షానికి గురైంది. సిబ్బం పరిశోధన కేంద్రానికి కాపలాగా ఉంటున్నారు. అధికారులు అందుబాటులో లేకపోవడం, అభివృద్ధి పనులు జరగకపోవడంతో కొందరు అక్రమార్కులు కేంద్రంలోని టేకు, వెదురు వృక్షాలను అక్రమంగా తరలిస్తున్నారు.
ఒక్కో టేకు చెట్టు విలువ రూ.3 లక్షల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 30 చెట్లుకుపైగా మాయం అయినట్లు తెలుస్తోంది. చుట్టూ ఫెన్సింగ్ రక్షణ ఉన్నా లోపల చెట్లు ఎలా మయామయ్యాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
చెట్లు అపహరణలో కేంద్రంలో పని చేసి వ్యక్తుల ప్రమేయం ఉండే ఉంటదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు లోతుగా విచారణ జరిపితే అసలు దొంగలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై వరంగల్ డీఎఫ్‌వో అనూజ్ అగర్వాల్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.