10-04-2025 10:24:38 PM
చివ్వేంల: సామాన్యుల దగ్గర నుండి జాతరలో బస్టాండ్లలో పట్టణాలలో వ్యక్తుల నుండి సెల్ ఫోన్ లను దొంగిలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసినట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. గురువారం చివ్వేంల పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించారు. వట్టి ఖమ్మం పహాడ్ ఫ్లైఓవర్ వద్ద స్థానిక ఎస్సై మహేశ్వర్ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు కార్లు రాగా అందులో ప్రధాన నిందితుడు పసుపులేటి రాజు పరారు అవ్వగా, మిగిలిన ముగ్గురు నిందితులను 2 కార్లు దొరికినట్లు తెలిపారు.
గత కొంతకాలంగా జిల్లాలో జరిగిన పెద్ద గట్టు జాతరలో అమాయకుల లక్ష్యంగా వారి వద్ద నుండి సెల్ ఫోన్ లను దొంగలించి ఆ ఫోన్లో ఉండే ఫోన్ పే గూగుల్ పేల ద్వారా లక్షల రూపాయలను డ్రా చేసుకొని జల్సాలకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు పసుపులేటి రాజు (పరారీలో ఉన్నాడు), కావడి సామిల్, కొమ్మూరి ఆదినారాయణ, సురేష్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రధాన నేరసుడైన పసుపులేటి రాజు కొంతమంది నిందితులను తన వద్ద పనిలో పెట్టుకొని ప్రతినెల నేరస్తులైన కావడి సామిల్ 100000 రూపాయలు, కొమ్మూరు ఆదినారాయణ 70000, సురేష్ లకు 50000 రూపాయల, చొప్పున జీతం ఇచ్చి ఈ దొంగతనాలను చేయిస్తున్నాడని తెలిపారు.
వారిని ఖరీదైన కార్లలో జల్సాలకు తిప్పుతూ ఈ దొంగతనాలను చేయించి సెల్ ఫోన్లలో ఉండే ఫోన్ పే గూగుల్ పే ద్వారా లక్షల రూపాయలను తీసుకుంటున్నట్లు తెలిపారు. దురాజ్ పల్లి జాతర లో ముగ్గురు సెల్ఫోన్లను దొంగలించి బొబ్బ వెంకట్ రెడ్డికి చెందిన ఫోన్ పే ద్వారా 99800 రూపాయలు, కల్లెట్ల పల్లి వీరయ్య ఫోన్ ద్వారా 54800, గొల్లపల్లి రమేశ్ 80000 వేల రూపాయలు, సూర్యాపేట బస్టాండ్ ఆవరణలో ఒక ఫోన్ దొంగిలించి అందులో నుండి 114400 లక్షల రూపాయలను డ్రా చేసి అందులో 64400 రూపాయలను ఖర్చు చేసినారని, బస్టాండ్ ఆవరణలోనే మరో వ్యక్తి వద్ద ఫోన్ దొంగిలించి 131381 రూపాయలు డ్రా చేసి 65981 ఖర్చుచేసి నట్లు తెలిపారు. నిందితుల నుంచి 350000 నగదు, మహీంద్రా kuv 100 కారు, Ertiga కారు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మహేశ్వర్, ఏఎస్ఐ సుధాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.