calender_icon.png 3 April, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టపగలే దొంగల హల్‌చల్

24-03-2025 01:34:18 AM

అనంతగిరి, మార్చి 23 : పొట్ట కూటి కోసం కూలి పనులకు వెళ్తూ జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలకు చెందిన రెండు ఇండ్లలో  పట్టపగలు జరిగిన దొంగతనం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది మండల పరిధిలోని ఖానాపురం గ్రామంలో తాళం వేసి ఉన్న రెండు ఇండ్లలోపట్టపగలే దొంగతనానికి పాల్పడి బంగారం, డబ్బులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు ఒకే రోజు రెండిళ్లలో దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ సంఘటన పై ఎలాంటి ఫిర్యాదు అందలేదని అనంతగిరి పోలీసు లు తెలిపారు.