20-03-2025 12:00:00 AM
కామారెడ్డి, మార్చి 19 (విజయ క్రాంతి) : ఓ దేవుని గుడిలో దొంగతనానికి యత్నించిన దొంగ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. పట్టుబడిన దొంగకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్తునూరు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామాని కి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటూ జులాయిగా తిరిగేవాడు.
ఇటీవల స్వగ్రామమైన ఉత్తనూర్ గ్రామానికి వచ్చాడు. గ్రామంలో సైతం జులాయిగా తిరుగుతూ మంగళవారం అర్ధరాత్రి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో హుండీ ని పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. తప్ప తాగి ఉన్న శ్రీకాంత్ హనుమాన్ ఆలయంలో ఉన్న హుండీని పగలగొట్టడంతో అందులో ఉన్న డబ్బులను తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులు చప్పుడు కు లేచి చుట్టుముట్టుకొని హనుమ మన్ ఆలయంలో చోరీకి పాల్పడిన శ్రీకాంత్ ను పట్టుకొని దేహాశుద్ధి చేశారు.
గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా అప్పటికే శ్రీకాంత్ శ్రుహ తప్పి పడిపోయాడు. పోలీసులు గ్రామానికి చేరుకొని శ్రుహ తప్పి పడిపోయిన శ్రీకాంత్ లో చికిత్స నిమిత్తం కామారెడ్డి కి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.
మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హనుమాన్ ఆలయంలో చోరీకి పాల్పడినందున గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేయడం వల్లే శ్రీకాంత్ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.