హైదరాబాద్ లో అంబులెన్స్ చోరీన చేసిన దొంగ హల్ చల్ చేశాడు. సూర్యాపేట వరకు వెంబడించి పోలీసులు దొంగను పట్టుకున్నారు. హైదరాబాద్- విజయవాడ వైవేపై సినిమా తరహాలో ఛేజింగ్ జరిగింది. హయత్ నగర్ లో 108 వాహనాన్ని చోరీ చేసి దొంగ పరారయ్యాడు. తక్షణమే అప్రమత్తమై దొంగను పట్టకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అంబులెన్స్ సైరన్ మోగిస్తూ అతివేగంతో విజయవాడకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. చిట్యాల వద్ద పట్టుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఢీకొట్టాడు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్ ను అంబులెన్స్ ఢీకొట్టింది. టేకుమట్ల వద్ద రోడ్డుపై అడ్డంగా లారీలు పెట్టి పోలీసులు దొంగను పట్టుకున్నారు. నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంబులెన్స్ ఢీకొట్టిన ఘటనలో ఎస్ఐ జాన్ రెడ్డి అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.