calender_icon.png 19 April, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్‌లో అర్ధరాత్రి దొంగ హల్‌చల్

18-04-2025 12:00:00 AM

పలు ఇండ్లలో చోరీకి యత్నం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రి ల్ 17(విజయక్రాంతి) : నగరంలో ని ఉప్పల్ రాఘవేంద్రకాలనీ, అన్నపూర్ణకాలనీ, కల్యాణపురి కాలనీలో బుధవారం అర్ధరాత్రి ఓ దొంగ హ ల్‌ఛల్ చేశాడు. పలు ఇండ్లలో చోరీ కి యత్నించాడు. కొన్ని ఇండ్లల్లోకి చొరబడి సోదాలు చేశాడు. ఎటువంటి విలువైన వస్తువులు, నగదు దొరకకపోవడంతో వెనుదిరిగాడు. కాగా ఆ దొంగ చేసిన ప్రయత్నాలన్నీ కాలనీల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఎవరి ఇంట్లోనూ పెద్దగా వస్తువులేమీ పోకపోవడంతో కాలనీల వాసులు ఊపిరి పీల్చుకున్నారు.